బాలకృష్ణా.. హిందూపురం ప్రజలు గుర్తున్నారా? | MLC Shaik Iqbal Slams Hindupur MLA Balakrishna | Sakshi
Sakshi News home page

బాలకృష్ణా.. హిందూపురం ప్రజలు గుర్తున్నారా?

Aug 15 2021 7:37 AM | Updated on Aug 15 2021 1:11 PM

MLC Shaik Iqbal Slams Hindupur MLA Balakrishna - Sakshi

ఓట్లు వేసిన ప్రజలు గుర్తున్నారా అని ఎమ్మెల్యే బాలకృష్ణను ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ప్రశ్నించారు.

హిందూపురం: ఓట్లు వేసిన ప్రజలు గుర్తున్నారా అని ఎమ్మెల్యే బాలకృష్ణను ఎమ్మెల్సీ షేక్‌ మహమ్మద్‌ ఇక్బాల్‌ ప్రశ్నించారు. శనివారం పట్టణంలోని 32వ వార్డు అహ్మద్‌ నగర్‌కు చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు వెంకటేశ్వరరావు, తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారికి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ, ఇతర పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణను నమ్ముకున్న కార్యకర్తలతో పాటు ఓట్లు వేసిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇంద్రజ, బాబు, పార్టీలో చేరిన వారిలో లక్ష్మణ్‌ రావు, అతావుల్లా, గంగమ్మ, వలి, ఆల్లాబకాష్, గౌతమ్, జగదీష్, ఇర్ఫాన్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement