పోలీసులు, అధికారులు టీడీపీ కార్యకర్తలయ్యారు.. లేళ్ల అప్పిరెడ్డి | MLC Lella Appi Reddy files complaint with State Election Commission against TDP anarchy | Sakshi
Sakshi News home page

పోలీసులు, అధికారులు టీడీపీ కార్యకర్తలయ్యారు.. లేళ్ల అప్పిరెడ్డి

Oct 23 2026 4:53 PM | Updated on Oct 23 2026 5:08 PM

MLC Lella Appi Reddy files complaint with State Election Commission against TDP anarchy

సాక్షి, విజయవాడ: పోలీసులతో పాటు రాష్ట్ర అధికారులు టీడీపీ కార్యకర్తల్లా మారారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల అరాచకంపై ఏపీ ఎస్‌ఈసీ కార్యాలయానికి వైఎస్సార్‌సీపీ నేతల బృందంతో వెళ్లి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలు చించేసి అభ్యర్థులపై దాడులకు దిగారని ఈ దౌర్జన్యాన్ని అడ్డుకోకుండా ఎన్నికల సంఘం చేతులెత్తిసిందన్నారు.

లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. "మూడో రోజు కూడా జడ్పీటిసి, ఎంపీటీసీ లకు నామినేషన్ వేయకుండా అడ్డుకొన్నారు. పోలీసులు, కొంతమంది రెవిన్యూ అధికారులు తెలుగుదేశం కార్యకర్తలగా వ్యవహరిస్తున్నారు. అన్ని ఆధారాలు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చాము. నామినేషన్ పత్రాలు చింపేసిన, నాయకులను హౌస్ అరెస్ట్ చేసిన ఎలక్షన్స్ కమిషన్ చేతులు ఎత్తేసింది.సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసిన చట్టంలో వున్నా లొసుగులను దగ్గర పెట్టుకొని కేవలం నాలుగు మున్సిపాలిటిల్లోనే నామినేషన్ అంటున్నారు.

దాడులు చేసింది.. అడ్డుకొంది, నామినేషన్ చించింది టీడీపీ నేతలు. పోలీసుల బాడీ కెమెరాలు కాదు. సీసీ ఫుటేజ్ చూడమని చెప్పాము. ఎన్ని చెప్పినా ఎలక్షన్ కమిషన్ కనీసం వినడం లేదు. ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలు కనీసం చూడకూడదు మాట్లాడకూడదు. అనేట్లు SEC వ్యవహరిస్తుంది. వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయిపోయాయి. భవిష్యత్తు తరాలకు ఎటువంటి సందేశం ఇవ్వాలని అనుకొంటున్నారు. అని అప్పిరెడ్డి అన్నారు.

నాయకులను అందరిని హౌస్ అరెస్ట్ చేశారని నామినేషన్ వేయడానికి వీధి పోరాటాలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీమంత్రిని పోలీసులు నెట్టేయడం ఏంటని అధికార పార్టీ నేతలు నామినేషన్ పత్రాలు చించేస్తున్న కనీసం చర్యలు లేవు. టీడీపీ వాళ్లే వైస్సార్సీపీ పేరుతో నామినేషన్ వేస్తారు. వాళ్లే విత్ డ్రా చేస్తారు. కన్నతల్లి తండ్రులను మార్చుకొంటారా? ఒక పార్టీ లో వుండి.. మరో పార్టీ పేరుతో నామినేషన్ వేస్తారా?  అని ప్రశ్నించారు.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ సమయం పెంచాలని  ఎన్నికల కమిషన్‌ని కోరుతున్నామన్న లేళ్ల అప్పిరెడ్డి.. SEC ఇచ్చిన సర్కులర్ కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే ఉందని దుయ్యబట్టారు. గంటన్నర ముందు సర్యులర్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? నిజంగా చిత్త శుద్ధి ఉంటే ఉదయం సర్యులర్ ఇచ్చేవాళ్ళు..చట్టాలు, విధానాలు ఏవి ఎన్నికల కమిషన్ కి లేవు. తెలుగు దేశానికీ మేలు చేయడమే పరామవాదిగా పని చేస్తున్నారని లేళ్ల అప్పిరెడ్డి  ధ్వజమెత్తారు. 


ఇదీ చదవండి: విడుదల రజనీని నెట్టేసిన ఎస్‌ఐ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement