సీఎం జగన్‌ను కలిసిన మంత్రాలయం ప్రతినిధులు

Mantralayam Committee Members Met YS Jagan Inviting Tungabhadra Pushkaras - Sakshi

సాక్షి, అమరావతి :  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ప్రతినిధులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు జరగనున్న తుంగభద్ర పుష్కరాలను కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద ప్రారంభించాలంటూ సీఎం జగన్‌కు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద ఆశీర్వచనం అందించిన మఠం ప్రతినిధులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాఘవేంద్రస్వామి మఠం ప్రతినిధులు, అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. (చదవండి : సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top