Lover Hulchul At The Wedding Ceremony In Visakhapatnam - Sakshi
Sakshi News home page

విశాఖ: పెళ్లి వేడుకలో హైడ్రామా.. భగతే నా ప్రియుడు అంటూ..

Dec 3 2022 6:51 PM | Updated on Dec 3 2022 7:37 PM

Lover Hulchul At The Wedding Ceremony In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నగరానికి చెందిన యువకుడు.. ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని మోసం చేశాడు. ఈ క్రమంలో జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. తాజాగా మరో అమ్మాయితో పెళ్లికి రెడీ కావడంతో కల్యాణ మండపం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ప్రేయసి పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది.

వివరాల ప్రకారం.. షీలానగర్‌లోని ఓ కల్యాణ మండపం వద్ద ప్రియాంక అనే యువతి పెట్రోల్‌ బాటిల్‌తో హడావుడి చేసింది. తన ప్రియుడు భగత్‌.. తనను మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భగత్‌ వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడని కల్యాణ మండపం వద్ద పెట్రోల్‌ ఒంటి మీద పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో, అక్కడున్న వారు ఆమెను అడ్డుకున్నారు.

అయితే, భగత్‌పై ఆరు నెలల క్రితమే ప్రియాంక.. దిశ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. భగత్‌ను రిమాండ్‌కు పంపించారు. ఈ క్రమంలో మూడు నెలల తర్వాత భగత్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం, ఈరోజు భగత్‌ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక కల్యాణ మండపం వద్ద హడావుడి చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement