విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసు: టీడీపీ నేతలకు జీవిత ఖైదు

సాక్షి, అనంతపురం: అనంతపురంలో వైఎస్సార్‌సీపీ నేత అప్పిచర్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి హత్య కేసులో టీడీపీ నేతలు శ్రీనివాసనాయుడు, గురుప్రసాద్ నాయుడికి జీవిత ఖైదు పడింది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులకు గుత్తి కోర్టు.. ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
వివరాల ప్రకారం.. పెద్దవడుగూరు సొసైటీ కార్యాలయంలో విజయ్‌భాస్కర్ రెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో టీడీపీ నేతలు శ్రీనివాసనాయుడు, గురు ప్రసాద్ నాయుడు ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఈ కేసుపై తాజాగా విచారణ చేపట్టిన గుత్తి కోర్టు.. వీరిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ తీర్పు నిచ్చింది. అలాగే, మరో ఇద్దరు నిందితులకు ఆరు నెలల జైలు శిక్షను విధించింది. కాగా, నిందితులంతా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అనచరులు కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: మార్గదర్శి అక్రమాల డొంక కదలడంతో రామోజీరావు బెంబేలు
మరిన్ని వార్తలు :