లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి | Lella Appireddy on tdp leaders | Sakshi
Sakshi News home page

లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి

Oct 17 2026 5:27 PM | Updated on Oct 17 2026 6:03 PM

Lella Appireddy on tdp leaders

విజయవాడ: రాజంపేట, పుంగనూరులో జరిగిన ఘటనలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ దృష్టికి తీసుకువచ్చామని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషనర్ ఘోరంగా విఫలమైందని చెప్పారు. ఈ స్థాయిలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని తెలిపారు. ఎంపీ చేతిలో నామినేషన్ పేపర్లు లాకెళ్లిపోతున్నారని చెప్పారు.

శనివారం అప్పిరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌​లో ప్రజాస్వామ్యం ఎక్కడ? ప్రజాస్వామ్యమా నీ అడ్రస్ ఎక్కడ? కడప నేతలను పోలీస్ అరెస్ట్ చేసి వాహనాల్లో తిప్పుతున్నారు. కార్పొరేటర్లు నామినేషన్ వేయడానికి అవినాశ్‌ రెడ్డికి 1.30 గం‍టలకు నామినేషన్ వేయడానికి రావాలని చెప్పారు. అలా వెళ్తే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు. దర్శిలో నామినేషన్ కు వెళ్లే వాళ్ళను అడ్డుకొని లాఠీ ఛార్జ్ చేశారు. 

పోలీసులను అడ్డం పెట్టుకొని నామినేషన్లు వేయకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే పని చేయాలి. కాగితాలు ఇస్తున్నాం.. మెట్లు ఎక్కుతున్నాం.. దిగుతూ వున్నాం.. చూస్తాం అంటున్నారు.. ఫలితం ఎక్కడ? వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా నామినేషన్లు వేయలేదా? నామినేషన్లు అడ్డుకొంటున్నారు.. అంటే ఓటమి తప్పదని కూటమి భావించింది. ఎన్నికలు జరగకూడదని, నామినేషన్లు వేయకూడదని కూటమి భావిస్తుంది. దాడులు జరుగుతుంటే ఎన్నికల కమిషన్ చూస్తుంది. దాడులు అడ్డుకోవడానికి మేము సిద్ధం కావాలి. ఆ స్థాయికి మమ్మల్ని తీసుకొని వెళ్లవద్దని చెబుతున్నాం’’ అని తెలిపారు. 

ఎవరిని నమ్మాలి? 
పుంగనూరులో జరిగిన ఘటనపై ఒకరిపై కూడా చర్యలు తీసుకోలేదని అప్పిరెడ్డి తెలిపారు. ‘‘తప్పు చేసిన వారిని శిక్షించకపోతే ఎవరిని నమ్మాలి? ప్రజాస్వామ్య మనుగడ కాపాడాలని ఎస్‌ఈసీని కోరుతున్నాం. పోలీసులు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలి. మెమోరాండంతో పాటు విజువల్స్ తో కూడా పెన్ డ్రైవ్  లో ఇచ్చాం. నామినేషన్ వేయడానికి వచ్చిన వ్యక్తిపై దాడి జరిగితే కోయ ప్రవీణ్ తప్పుగా మాట్లాడుతున్నారు. 

రాయలసీమ పోలీస్ అధికారిగా ఉన్నది కోయ ప్రవీణ్. ఆయనపై చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ చేయాలి. నామినేషన్ గడువు పొడిగించాలని కోరాం. మేము చెప్పిన అని అంశాలు మాట్లాడతామని చెప్పారు. నిన్న కొన్ని ప్రాంత్రాల్లో జరిగిన దమన ఖండ నేడు అనేక ప్రాంతాలకు చేరింది. సాయి కృష్ణ కేసులో హైకోర్టు సీబీఐ ఎంక్వైరీ వేసింది. పోలీసులు సిగ్గుపడాలి. అధికారం శాశ్వతమనుకుని చంద్రబాబు, లోకేశ్‌ భావిస్తున్నారు. మంచి చేశానని దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలు నిర్వహించు. 700 రోజుల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వస్తుంది. అట్టుకు అట్టున్నరా పెడతాం’’ అని అప్పిరెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి: టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్‌: అవినాశ్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement