ఈసీకి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీడీపీ గూండాలు చేస్తున్న దాడులపై ఈసీకి వివరించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు.
కాగా, మునిసిపల్ ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. ఓటమి భయంతోనే టీడీపీ కూటమి నేతలు అలజడి సృష్టిస్తున్నారని, టీడీపీ నేతల అరాచకాలకు పోలీసు అధికారులు సహకరించడం దుర్మార్గం అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇదీ చదవండి: టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి


