
డోన్ టౌన్: డోన్ రైల్వే స్టేషన్‌లో రెండో ప్లాట్‌ఫామ్ ట్రాక్‌పై శుక్రవారం ఉదయం తెగిపడిన ఎడమ చేయి భాగం కనిపించడం కలకలం సృష్టించింది. ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని ప్రయాణికుడి చేయి తెగిపడితే రైల్వే అధికారులకు సమాచారం అందేది. ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎవ్వరినైన హత్య చేసి అచూకీ లభించకుండ నిందితులు హతుడి శరీర భాగాలను రైలు మార్గంలో అక్కడక్కడ పడేస్తూ వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు స్టేషన్‌కు ఇరువైపులా గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి క్లూ లభించలేదు. రైల్వే పోలీసు ఎస్‌ఐ బింధు మాధవి మాట్లాడుతూ.. ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఎడమ చేయి భాగం లభ్యమైందని, ఇతర ఏ శరీరం భాగాలు కనపించలేదన్నారు. లభించిన చేయి భాగాన్ని కర్నూలు ఫోరోనిక్స్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.