breaking news
Don railway station
-
ఆ చేయి ఎవరిది?
డోన్ టౌన్: డోన్ రైల్వే స్టేషన్లో రెండో ప్లాట్‌ఫామ్ ట్రాక్‌పై శుక్రవారం ఉదయం తెగిపడిన ఎడమ చేయి భాగం కనిపించడం కలకలం సృష్టించింది. ప్రమాదవశాత్తూ గుర్తు తెలియని ప్రయాణికుడి చేయి తెగిపడితే రైల్వే అధికారులకు సమాచారం అందేది. ఈ విషయంపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఎవ్వరినైన హత్య చేసి అచూకీ లభించకుండ నిందితులు హతుడి శరీర భాగాలను రైలు మార్గంలో అక్కడక్కడ పడేస్తూ వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు స్టేషన్‌కు ఇరువైపులా గాలింపు చర్యలు చేపట్టినా ఎలాంటి క్లూ లభించలేదు. రైల్వే పోలీసు ఎస్ఐ బింధు మాధవి మాట్లాడుతూ.. ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఎడమ చేయి భాగం లభ్యమైందని, ఇతర ఏ శరీరం భాగాలు కనపించలేదన్నారు. లభించిన చేయి భాగాన్ని కర్నూలు ఫోరోనిక్స్ ల్యాబ్‌కు పంపామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
డబుల్ డెక్కర్ రైలులో పనిచేయని ఏసీలు
గంట పాటు డోన్‌లో నిలిపివేత డోన్ రూరల్, న్యూస్‌లైన్: తిరుపతి నుంచి కాచిగూడకు బయలుదేరిన డబుల్ డెక్కర్ రైలులో గురువారం ఏసీలు పనిచేయలేదు. అలాగే నీటి సరఫరా కూడా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డోన్ రైల్వేస్టేషన్‌కి 12 గంటలకు చేరగానే వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైలులో అసౌకర్యాలపై డోన్ స్టేషన్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన రైల్వే సిబ్బందితో మాట్లాడి.. ఏసీలకు మరమ్మతులు చేయించారు. అలాగే నీటి సరఫరాను పునరుద్ధరించారు. పనులు పూర్తికాగానే ఒంటి గంటకు డబుల్ డెక్కర్ రైలు కాచిగూడకు బయలుదేరి వెళ్లింది. ప్రయాణికులు దాదాపు గంట పాటు డోన్ రైల్వే స్టేషన్లో నిరీక్షించాల్సి వచ్చింది.