కనెక్ట్‌ టు ఆంధ్రకి లారస్‌ ల్యాబ్స్‌ భారీ విరాళం

Laurus Labs Donated 4 Cr To CMRF For Nadu Nedu Programme - Sakshi

తాడేపల్లి: నాడు నేడు పథకం రెండో విడత కార్యక్రమానికి భారీ విరాళం అందింది. ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాల కోసం ‘కనెక్ట్‌ టు ఆంధ్ర’కు లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం అందించింది. ఈ మేరకు లారస్‌ ల్యాబ్స్‌ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం కలిశారు. 

చెక్కుతో పాటు పనులకు సంబంధించిన పత్రాలను అందజేశారు. మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్‌ ల్యాబ్స్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ డాక్టర్‌ చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా కృష్ణ చైతన్య, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు సీఎం జగన్‌కు తెలిపారు. కార్యక్రమంలో కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈఓ వి. కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top