బ్రోకర్లు, జోకర్లకు టీడీపీ వేదికగా మారింది: మంత్రి కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana Serious Comments On CBN And Yellow Media - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: బ్రోకర్లు, జోకర్లకు టీడీపీ వేదికగా మారింది. అమరావతి రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ కుట్ర ఉంది. టీడీపీ కావాలనే రైతులను రెచ్చగొడుతోందని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. 

మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర బాబు, లోకేష్ బాబుకు పిచ్చి ముదిరిపోయింది. టీడీపీ బ్రోకర్లకు, జోకర్లకు వేదికగా మారింది. ఉత్తరాంధ్రకి అమరావతి రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ హస్తం ఉంది. ఇది టీడీపీ కుట్ర. తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని రైతులను రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించి, లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ రాజధాని వద్దు అని వారిని రెచ్చ గొడతారా?. విశాఖ వద్దు అమరావతి ముద్దు అంటే వారు ఊరుకుంటారా?.

తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్ పార్టీ. మీది ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ కాదు. అన్యాయంగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు. తెలుగుదేశం పార్టీ ముగిసిపోయిన అధ్యాయం. వెంటిలేటర్ మీద ఉన్న చంద్రబాబు పార్టీని, దత్తపుత్రుడుని బ్రతికించాలని ఎల్లోమీడియా ఎంత కష్టపడ్డా ఏమీ ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారు. చంద్రబాబు కుట్రలు పన్ని ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చూస్తున్నారు. ప్రజల గుండెల్లో ఉన్న సీఎం జగన్‌కు వీరు అంగుళం కూడా కదల్చలేరు. మూడు రాజధానులు మా పార్టీ నిర్ణయం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి పాలన  వికేంద్రకరణతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ‘ఎన్టీఆర్‌ కుమార్తెను చంద్రబాబు పెళ్లి చేసుకోకుంటే..’

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top