‘పేదల పాలిట నిజమైన దేవుడు వైఎస్‌ జగన్‌’

Kolusu Parthasarathy Comments About YSR On His Death Anniversary - Sakshi

సాక్షి, కృష్ణా : అనేక సంక్షేమ పథకాలతో దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని పెనమలూరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. నేడు వైఎస్సార్‌ తమ మధ్య లేకపోవడం ప్రతి పేదవాడికి తీరనిలోటు అని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్‌ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అందరూ వైఎస్సార్‌కు ఘనమైన నివాళులు ఆర్పిస్తున్నారని తెలిపారు. ఆయన పాలనలో రాష్ట్రంలో లబ్ధి పొందని ఇంటి గడప లేదని వ్యాఖ్యానించారు. (ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తోంది)

కుల,మత,పార్టీలు చూడకుండా పేదవారందరికి పధకాల ద్వారా మేలు చేశారని పార్థసారధి గుర్తు చేసుకున్నారు. పేదవాడి చదువుకై విప్లవాత్మక ఆలోచన చేసి..పేద పిల్లలు చదివితే ఆ కుటుంబాల అభివృద్ధి చెందుతాయని ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చారన్నారు. పేదలందరికి ఇళ్ళు కట్టించిన గొప్ప వ్యక్తి, మొదటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికోసం ఆరోగ్య శ్రీ తీసుకు వచ్చారని, దీని వల్ల పేదోడు కూడా కోటేశ్వరుడితో సమానంగా వైద్యం పొందేలా చేశారని కొనియాడారు.(‘పశ్చిమ’ తీరం.. అభివృద్ధి సమీరం)

‘మన అదృష్టం కొద్ది ఆయన తనయుడు మన ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన ఆశయాలు నెరవేర్చుతున్నారు. నాన్న ఒక్క అడుగు వేస్తే రెండడుగులు వేస్తానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారు. చెప్పిన రీతిలోనే తండ్రి రీయింబర్స్‌మెంట్ తీసుకు వస్తే తనయుడు అమ్మ ఒడితో పేదలకు అండగా నిలబడ్డారు. తండ్రి 45 లక్షల ఇళ్లు కడితే విభజిత రాష్టంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. పేదల పాలిట నిజమైన దేవుడు జగన్‌మోహన్‌రెడ్డి’ అని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. (రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top