ఏలూరులో రెచ్చిపోయిన జనసేన కార్యకర్తలు.. ఇద్దరికి తీవ్రగాయాలు

సాక్షి, ఏలూరు: ఏలూరులో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. నాగేంద్రకాలనీ దళితులపై కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి కాలు విరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసుల ఎదుటే జనసేన నాయకులు తమను దూషించారని మాల మహానాయకుడు అరుణ్ ఆరోపించారు.
జనసేన కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. సెక్షన్ 306, 324 కింద కేసు నమోదు చేస్తామని ఏలూరు రూరల్ పోలీసులు హామీ ఇవ్వడంతో దళిత సంఘాల నాయకులు శాంతించారు. ఏలూరు నియోజకవర్గ జనసేన ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు కార్యాలయం సెటిల్‌మెంట్లకు అడ్డాగా మారిందని స్థానికంగా విమర్శలు వస్తున్నాయి.
చదవండి: (అచ్చెన్నకు లోకేష్‌తో చెడిందా?.. చినబాబుకు కళా అందుకే దగ్గరవుతున్నారా?)
మరిన్ని వార్తలు