ఊపిరి పోసిన జగనన్న ఆరోగ్య సురక్ష | Jagananna Arogya Suraksha Save Young Man Life | Sakshi
Sakshi News home page

ఊపిరి పోసిన జగనన్న ఆరోగ్య సురక్ష

Oct 17 2023 10:47 AM | Updated on Oct 17 2023 10:47 AM

Jagananna Arogya Suraksha Save Young Man Life - Sakshi

తుని రూరల్‌: జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య బృందం అందించిన అత్యవసర వైద్య సేవలు ఓ యువకుడి ప్రాణాలు నిలబెట్టాయి. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట శివారు టి.వెంకటాపురంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. హెచ్‌.కొత్తూరుకి చెందిన మలగంటి లోకేష్‌ ఉన్నట్టుండి ఆయాసంతో కుప్పకూలిపోయాడు. అతడికి మెరుగైన వైద్యం అందించాలంటే 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న తుని పట్టణానికి తీసుకువెళ్లాలి.

పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న టి.వెంకటాపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం జరుగుతోందని తెలుసుకున్న లోకేష్‌ బంధువులు వెంటనే అక్కడికి తీసుకువెళ్లారు. వైద్య బృందం 104లో ఉంచి సీపీఆర్‌ పరికరంతో హృదయ స్పందన, శ్వాస తిరిగి ప్రారంభమయ్యేలా ప్రయత్నం చేశారు. వారి కృషి ఫలించడంతో కొంతసేపటికి హృదయ స్పందన తిరిగి ప్రారంభమై లోకేష్‌ కళ్లు తెరిచాడు.

వెంటనే ఎర్రకోనేరు గ్రామం వరకూ 104లో, అక్కడి నుంచి 108లో తుని ఆస్పత్రికి తరలించారు. గోల్డెన్‌ సెక్షన్స్‌లో సీపీఆర్‌ సేవలు అందించడం సత్ఫలితాన్ని ఇచి్చందని వైద్యులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement