వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి సీఎం జగన్‌కు ఆహ్వానం

Invitation To CM Jagan Inauguration Of Venkateswara Swamy Temple In Amravati - Sakshi

సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి బుధవారం కలిశారు. అమరావతిలో కొత్తగా నిర్మించిన వేంకటేశ్వరస్వామి దేవస్థానం ప్రారంభోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఆహ్వాన పత్రాన్ని ముఖ్యమంత్రికి టీటీడీ ఛైర్మన్‌ అందజేశారు.
చదవండి: సీఎం జగన్‌ చేతుల మీదుగా బీ ఫారం అందుకున్న విక్రమ్‌రెడ్డి

ఈ సందర్భంగా సీఎంకు స్వామివారి ప్రసాదాలు అందజేసిన టీటీడీ వేద పండితులు.. వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఛైర్మన్‌ వెంట జేఈవో వి.వీరబ్రహ్మం, సీఎస్‌వో నరసింహ కిశోర్, చీఫ్‌ ఇంజనీర్‌ డి.నాగేశ్వరరావు ఉన్నారు. ఈ నెల 4 నుంచి విగ్రహ ప్రతిష్టకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 9న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top