
సాక్షి, కర్నూలు : శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా కృష్ణమ్మ తరలివస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులో 175 టీఎంసీల నీరు నిల్వకు చేరుకుంది. జూరాల రిజర్వాయర్ నుంచి, సుంకేసుల బ్యారేజీ నుంచి మొత్తం శ్రీశైలానికి 3లక్షల 63 వేల క్యూసెక్కుల నీరు వస్తుంది.(అల్ప పీడనం: మరో రెండు రోజుల పాటు వర్షాలు)
కృష్ణా తుంగభద్ర నదుల ప్రవాహం రోజు రోజుకీ పెరుగుతోంది. బుధవారానికి మరింత వరద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నట్లు జలవనరుల శాఖ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమ జిల్లాలకు నీటి విడుదలను పెంచారు.(గోదావరి జిల్లాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే)