15 గంటలుగా మండుతూనే...  | Huge fire in Ongole | Sakshi
Sakshi News home page

15 గంటలుగా మండుతూనే... 

Oct 25 2023 6:05 AM | Updated on Oct 25 2023 6:05 AM

Huge fire in Ongole - Sakshi

గోడౌన్‌లో ఎగసిపడుతున్న మంటలు 

ఒంగోలు సబర్బన్‌: ప్రకాశం జిల్లా ఒంగోలులోని గాంధీ రోడ్డు సమీపంలోని పప్పు బజార్‌లో ఉన్న కాయర్‌ రోప్‌ మర్చంట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున సునీల్‌ కాయర్‌ రోప్‌ మర్చంట్స్‌ గోడౌన్‌లో మంటలు వ్యాపించాయి.

ఒంగోలు ఫైర్‌ ఇంజన్లతో పాటు టంగుటూరు, కొండపి, బాపట్ల జిల్లా అద్దంకి నుంచి 8 ఫైర్‌ ఇంజన్లు తీసుకువచ్చి మంటలను అదుపు చేస్తున్నారు. 15 గంటలకు పైగా మంటలు దట్టంగా వ్యాపిస్తూనే ఉన్నాయి. భారీగా స్టాక్‌ ఉండటంతో మంటలు అదుపులోకి రావడం లేదు. ఈ ప్రమాదంలో రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిలినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement