
కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ కాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. వర్షం పడుతున్నా భక్తులు లెక్కచేయకుండా శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు. టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది.
శ్రీవారి దర్శనాన్ని ముగించుకొని బయటకు వస్తున్న భక్తులు పరుగులు తీస్తూ చలవ పందిళ్ల కిందకు చేరుకున్నారు. వర్షం కారణంగా తిరుమలలోని కొన్ని దుకాణాలు మూతపడ్డాయి. శ్రీవారి దర్శనానికి 24 గంటలు సమయం పడుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 87,759 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా 42,043 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి హుండీ రూపంలో రూ.4.16 కోట్ల ఆదాయం వచి్చంది.