కరోనా సోకిందని ఇంట్లో పెట్టి తాళం | House Owner Over Action On Corona Victim | Sakshi
Sakshi News home page

కరోనా సోకిందని ఇంట్లో పెట్టి తాళం

Jul 27 2020 4:19 AM | Updated on Jul 27 2020 4:19 AM

House Owner Over Action On Corona Victim - Sakshi

యజమానితో ఇంటి తాళం తీయిస్తున్న పోలీసులు

సత్తెనపల్లి: కరోనా సోకిందని ఓ కుటుంబాన్ని ఇంట్లో పెట్టి ఇంటి యజమాని తాళం వేసిన ఘటన ఆదివారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జరిగింది. ఓ కుటుంబానికి కరోనా సోకడంతో ఇంటి యజమాని వారిని ఇంట్లో పెట్టి తాళం వేసింది. బాధితులు ఫోన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు అక్కడికి చేరుకుని బాధితులను విడిపించి ఇంటి యజమానిని హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement