మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యం: సుచరిత

Home Minister Sucharitha Comments On Chandrababu - Sakshi

రమ్య హత్య కేసు నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేశాం..

దిశ చట్టం కఠినంగా అమలు చేస్తున్నాం

హోంమంత్రి సుచరిత

సాక్షి, అమరావతి: మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని  హోంమంత్రి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళల భద్రతపై తక్షణం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. దిశ చట్టం కఠినంగా అమలు చేస్తున్నామని.. దిశ చట్టం కింద 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ నమోదు చేస్తున్నామని తెలిపారు.

1645 కేసులపై ఏడు రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని వెల్లడించారు. రమ్య హత్య కేసు నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేశామన్నారు. ఆసుపత్రి వద్ద లోకేష్‌ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీఎం జగన్ మానవత్వంతో బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారన్నారు. ‘‘చంద్రబాబు పాలనలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయి. ఎమ్మార్వో వనజాక్షి, రిషితేశ్వరికి ఎలాంటి భద్రత కల్పించారో చూశాం. గతంతో పోలిస్తే నాలుగు రెట్లు మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయి. సీఎం జగన్ పాలనలో మహిళలకు భరోసా ఏర్పడింది. సీఎం జగన్‌ పాలనలో దళితులు గౌరవం పొందుతున్నారని’’ హోంమంత్రి సుచరిత అన్నారు.

ఇవీ చదవండి:
కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు
ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top