breaking news
Women protect act
-
సీఎం చంద్రబాబును కలవాలంటూ యశోదమ్మ అనే మహిళ నిరసన
-
మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యం: సుచరిత
సాక్షి, అమరావతి: మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని హోంమంత్రి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళల భద్రతపై తక్షణం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. దిశ చట్టం కఠినంగా అమలు చేస్తున్నామని.. దిశ చట్టం కింద 7 రోజుల్లోనే ఛార్జ్‌షీట్ నమోదు చేస్తున్నామని తెలిపారు. 1645 కేసులపై ఏడు రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని వెల్లడించారు. రమ్య హత్య కేసు నిందితుడిని గంటల వ్యవధిలో అరెస్ట్ చేశామన్నారు. ఆసుపత్రి వద్ద లోకేష్ వ్యవహరించిన తీరు సరికాదన్నారు. సీఎం జగన్ మానవత్వంతో బాధిత కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారన్నారు. ‘‘చంద్రబాబు పాలనలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయి. ఎమ్మార్వో వనజాక్షి, రిషితేశ్వరికి ఎలాంటి భద్రత కల్పించారో చూశాం. గతంతో పోలిస్తే నాలుగు రెట్లు మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయి. సీఎం జగన్ పాలనలో మహిళలకు భరోసా ఏర్పడింది. సీఎం జగన్ పాలనలో దళితులు గౌరవం పొందుతున్నారని’’ హోంమంత్రి సుచరిత అన్నారు. ఇవీ చదవండి: కొనసాగుతున్న అల్పపీడనం: ఏపీలో భారీ వర్షాలు ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. -
మహిళల భద్రతపై కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్: మహిళల రక్షణ, భద్రతపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణపై ఏర్పాటు చేసిన కమిటీ అందచేసిన నివేదికపై అధికారులతో కేసీఆర్ చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.