ప్లాస్టిక్‌ కవర్‌లో పసికందు.. ప్రసవం తరువాత చెట్టుకు వేలాడదీసి | heartbreaking incident took place in Chintoor Agency, Alluri Sitarama Raju District | Sakshi
Sakshi News home page

ఏ కన్నతల్లి బిడ్డో ఏమో.. ప్రసవం తరువాత పసికందును ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి చెట్టుకు వేలాడదీసి

Jun 13 2025 9:18 PM | Updated on Jun 13 2025 9:18 PM

heartbreaking incident took place in Chintoor Agency, Alluri Sitarama Raju District

సాక్షి,అల్లూరి : అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డను వర రామచంద్రపురం మండలం కొక్కెరగూడెం అడవిలో వదిలేసిన వైనం వెలుగులోకి వచ్చింది. 

ఏ కన్నతల్లిబిడ్డో ఏమో ప్రసవం తరువాత పసికందును ప్లాస్టిక్ కవర్‌లో పెట్టి చెట్టుకు వేలాడ దీశారు. ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టడంతో ఊపిరాడక గుండలవిసేలా ఏడుస్తున్న పసికందును స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న పసికందును అత్యవసర చికిత్స నిమిత్తం చింతూరు ఆసుపత్రికి తరలించారు. చింతూరు పసికందుల వార్డులో మగ బిడ్డకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement