‘లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలి’

Health Secretary Doctor Jawahar Reddy Talk On Coronavirus Treatment In AP - Sakshi

సాక్షి, విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పేషెంట్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. తీవ్ర జ్వరం, శ్వాసకోశ ఇబ్బందులుంటే వెంటనే ఆస్పత్రిలో చేరాలని కోరారు. కరోనా లక్షణాలు ఉంటే వాలంటీర్లకు తెలపాలని దండోరా వేయించామని పేర్కొన్నారు. మండల స్థాయిలోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. కరోనా లక్షణాలుంటే వెంటనే కాల్‌సెంటర్లకు కాల్‌ చేయాలని జవహర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 94శాతం కంటే తక్కువ ఆక్సిజన్‌ ఉన్నవారు వాలంటీర్ల‌కు చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. కరోనా పేషెంట్‌ బంధువులకు వివరాలు తెలిపేందుకు హెల్ప్‌ డెస్క్‌ను పెట్టామని ఆయన తెలిపారు. (భారత్‌: రెండో రోజు 60 వేలు దాటిన కరోనా కేసులు)

రాష్ట్రంలో 8.76 శాతం పాజిటివ్ రేటు, 0.89 శాతం మరణాల రేటు ఉందని తెలిపారు. దీని బట్టి మెరుగైన వైద్యం అందిస్తున్నామని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో మనల్ని అభినందిస్తోందని గుర్తుచేశారు. మూడు, నాలుగు రోజులుపాటు జ్వరం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటే తక్షణమే ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ఈ లక్షణాలుంటే పరీక్ష చేయకపోయినా ఆస్పత్రిలో చేరాలన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కాల్ సెంటర్లు పెట్టామని వ్యాఖ్యానించారు. వెంటనే ఆస్పత్రిలో చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. చివరిదశలో ఆస్పత్రికి రావడం వలన కాపాడలేకపోతున్నామని అన్నారు. కనీసం ఆరురోజులు ఆస్పత్రిలో ఉంటే ప్రాణాలు కాపాడగలమని చెప్పారు. ఈ విషయంలో డాక్టర్లు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించామని తెలిపారు.

ప్రతి ఆస్పత్రిలో ఎమర్జెన్సీ మందులను అందుబాటులో ఉంచామన్నారు. 104ద్వారా ప్రజలకు పూర్తి సమాచారం అందిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లో కూడా నిరంతరం పనిచేసే కాల్ సెంటర్లు పెట్టామన్నారు. పేషెంట్ ఆస్పత్రిలో చేరేంతవరకు ట్రాక్ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్‌ని ఏర్పాటు చేశామన్నారు. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు బాధ్యతగా ఉండాలన్నారు. ప్రభుత్వం అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తోందని గుర్తుచేశారు. ప్రజలు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మాస్క్ తప్పని సరిగా ధరించి బయటకు రావాలన్నారు. భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే 6 నెలలు కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

యూనిసేఫ్ సహాయంతో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 20వేల మంది సిబ్బంది, 10వేల మంది ట్రైనీ నర్సులను కేటాయించామని వెల్లడించారు. అదనంగా వెయ్యి వెంటిలేటర్లు తెప్పించే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొచ్చామని, యాంటీబాడీస్ సర్వే నాలుగు జిల్లాల్లో మొదలు పెట్టామన్నారు. సీహెచ్‌సీల్లో కూడా ఆక్సిజన్ బెడ్లు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సుమారు 14వేల వరకు  ఆక్సిజన్ బెడ్లు సిద్ధం చేశామన్నారు. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో 70 శాతం చనిపోతున్నారని తెలిపారు. జూనియర్ డాక్టర్లకు జీతాలు పెంచుతామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

20-09-2020
Sep 20, 2020, 03:08 IST
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో రికార్డు నమోదైంది. శనివారం ఉదయం 9 గంటల సమయానికి రాష్ట్రంలో...
19-09-2020
Sep 19, 2020, 21:02 IST
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పలువురు ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఈ...
19-09-2020
Sep 19, 2020, 17:28 IST
వాషింగ్టన్‌: మహమ్మారి కరోనా కాలంలో ఫేస్‌మాస్కుల వినియోగం భారీగా పెరిగిపోయింది. కోవిడ్‌-19‌ బారి నుంచి తమను తాము రక్షించుకునేందుకు దాదాపు...
19-09-2020
Sep 19, 2020, 16:03 IST
ప్రభుత్వ పాఠశాలలకు వెనక బడిన వర్గాల పిల్లల్లో ఎక్కువ మంది మధ్యాహ్న భోజన పథకం కోసమే వస్తారు. ఇక వారు...
19-09-2020
Sep 19, 2020, 15:08 IST
తొలి మూడు ఎపిసోడ్లు పాత్రల పరిచయంతో సరదాగా సాగిపోగా.. నాలుగో ఎపిసోడ్‌ నుంచి థ్రిలింగ్‌ మొదలవుతుంది. ఇక లాక్డ్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేయడంలో సక్సెస్‌...
19-09-2020
Sep 19, 2020, 14:02 IST
ఎందుకు మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోంది ? సకాలంలో చికిత్స తీసుకోవడం వల్లన మృతుల సంఖ్య తగ్గుతూ వస్తోందా?
19-09-2020
Sep 19, 2020, 13:50 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావం పార్లమెంట్‌ సమావేశాలపై తీవ్రంగా పడింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా...
19-09-2020
Sep 19, 2020, 13:33 IST
ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌ తప్పనిసరి. అయితే మనలో చాలా మంది మాస్క్‌ను సరిగా...
19-09-2020
Sep 19, 2020, 10:08 IST
న్యూఢిల్లీ : భార‌త్‌తో క‌రోనా విజృంభిస్తోంది.  గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో  93,337 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి....
19-09-2020
Sep 19, 2020, 04:51 IST
మాస్కో: రష్యా కరోనా టీకా స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌ భద్రతపై అనుమానాలు నెలకొ న్నాయి. టీకా డోసులు తీసుకున్న ప్రతీ...
19-09-2020
Sep 19, 2020, 04:43 IST
మాదాపూర్‌(హైదరాబాద్‌): సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌ పోలీసుస్టేషన్‌లో డిటెక్టివ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (డీఎస్‌ఐ)గా పనిచేస్తున్న అబ్బాస్‌ అలీ(57) కరోనాతో...
19-09-2020
Sep 19, 2020, 04:39 IST
లండన్‌: యూకేలో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్లీ తీవ్రమవుతోంది. సెకండ్‌ వేవ్‌తో కేసులు రెట్టింపు అయ్యాయి. ఉత్తర ఇంగ్లండ్, లండన్‌లలో...
19-09-2020
Sep 19, 2020, 04:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. శుక్రవారానికి రికవరీ రేటు 85.29...
19-09-2020
Sep 19, 2020, 04:28 IST
► అతని పేరు డాక్టర్‌ శివశంకర్‌ (పేరు మార్చాం). యాదాద్రి జిల్లాలోని ఒక పీహెచ్‌సీలో మెడికల్‌ ఆఫీసర్‌. అతనికి చౌటుప్పల్‌లోనూ ప్రైవేట్‌...
19-09-2020
Sep 19, 2020, 04:14 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారిని నిలువరించే వ్యాక్సిన్‌ ఎప్పటికి వస్తుందో నిర్దిష్టమైన అంచనాల్లేవు కానీ... ఆ వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత...
19-09-2020
Sep 19, 2020, 03:46 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం వైఎస్‌...
18-09-2020
Sep 18, 2020, 21:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 38 వేలకు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా...
18-09-2020
Sep 18, 2020, 17:42 IST
లండన్‌ : ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ సోకిందా లేదా నిర్ధారించేందుకు మరో పరికరం ప్రపంచ మార్కెట్‌లోకి వస్తోంది.  ఈ పరికరం ద్వారా...
18-09-2020
Sep 18, 2020, 17:35 IST
సాక్షి, అమరావతి: కరోనా వైద్య సేవల్లో ఎక్కడా ఏ లోటు రాకూడదని, సిబ్బంది నియామకాలు త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి...
18-09-2020
Sep 18, 2020, 17:02 IST
8,096 పాజిటివ్‌గా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,09,558  కు చేరింది.
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top