లగేజీ లేక హజ్ యాత్రికులు అవస్థలు.. ముస్లిం సంఘాల ఆగ్రహం | Hajj pilgrims face dire situation due to non-receipt of luggage | Sakshi
Sakshi News home page

లగేజీ లేక హజ్ యాత్రికులు అవస్థలు.. ముస్లిం సంఘాల ఆగ్రహం

Apr 23 2026 3:42 PM | Updated on Apr 23 2026 5:10 PM

Hajj pilgrims face dire situation due to non-receipt of luggage

కృష్ణా, సాక్షి: రాష్ట్రం నుంచి హాజ్‌ యాత్రకు వెళ్లిన హజ్‌ యాత్రికులు తమ లగేజ్‌లు అందక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 18న గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి 335 మంది హజ్‌ యాత్రకు బయిలుదేరారు. అయితే ఆ సమయంలో విమానంలో అధిక లగేజ్‌ ఉందనే కారణంతో గన్నవరంలో ఎయిర్‌పోర్టులో 285 బ్యాగులను ఉంచారు. అయితే ఐదు రోజుల గడిచినా ప్రయాణికులకు లగేజ్‌ చేరకపోవడంతో అక్కడ వారు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా వెంటనే తమ లగేజ్‌లను అందజేయాలని ఆందోళన చేపడుతున్నారు.

ఈ సమస్యపై యాత్రికుల బంధువులు హజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భగవంతుని దర్శనం కోసం వెళ్లిన యాత్రికులపై ఇంత నిర్లక్షం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.  వేరే దేశంలో వారు వారి కనీస అవసరాలు లేకుండా వారు ఎలా ఉంటారని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement