haz pilgrimage
-
లగేజీ లేక హజ్ యాత్రికులు అవస్థలు.. ముస్లిం సంఘాల ఆగ్రహం
కృష్ణా, సాక్షి: రాష్ట్రం నుంచి హాజ్ యాత్రకు వెళ్లిన హజ్ యాత్రికులు తమ లగేజ్లు అందక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 18న గన్నవరం ఎయిర్పోర్టు నుంచి 335 మంది హజ్ యాత్రకు బయిలుదేరారు. అయితే ఆ సమయంలో విమానంలో అధిక లగేజ్ ఉందనే కారణంతో గన్నవరంలో ఎయిర్పోర్టులో 285 బ్యాగులను ఉంచారు. అయితే ఐదు రోజుల గడిచినా ప్రయాణికులకు లగేజ్ చేరకపోవడంతో అక్కడ వారు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎలాగైనా వెంటనే తమ లగేజ్లను అందజేయాలని ఆందోళన చేపడుతున్నారు.ఈ సమస్యపై యాత్రికుల బంధువులు హజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ముస్లిం సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భగవంతుని దర్శనం కోసం వెళ్లిన యాత్రికులపై ఇంత నిర్లక్షం ఏంటని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. వేరే దేశంలో వారు వారి కనీస అవసరాలు లేకుండా వారు ఎలా ఉంటారని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. -
'సౌదీ అరేబియాను శిక్షించండి'
సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని శిక్షించాలంటూ బుధవారం ఇరాన్ అధ్యక్షుడు హస్సాన్ రౌహాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇరానీయులను హజ్ యాత్రకు నిషేధించడంపై ఆయన స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ కలిసి సౌదీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. కేబినేట్ మీటింగ్ లో సౌదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేబినేట్ మీటింగ్ లో చర్చించిన ఆయన ఇస్లాం, ఇరుగుపొరుగు దేశాలను సౌదీపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం హజ్ యాత్రకు చెందిన సమస్యలైతే పరిష్కరించుకోవచ్చని కానీ, సౌదీ ప్రభుత్వం టెర్రరిజాన్ని పోత్రహిస్తోందని రౌహాని ఆరోపించారు. సౌదీ కారణంగానే ఇరాక్, సిరియా, యెమెన్ లకు నెత్తుటి మరకలు అంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది హజ్ యాత్రలో వందలాది ఇరానీయుల మరణానికి సౌదీ ప్రభుత్వమే కారణమని ఇరాన్ చేసిన వ్యాఖ్యలను సౌదీ అరేబియా తీవ్రంగా పరిగణించింది.


