సర్వైకల్‌ క్యాన్సర్ అవగాహనలో గిన్నిస్ రికార్డు.. విజ్ఞాన్ యూనివర్సిటీ వేదికగా

Guinness World Record  Cervical Cancer Awareness Vignan University - Sakshi

గుంటూరు: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ పౌండేషన్, విజ్ఞాన్ యూనివర్సిటీ, కలెక్టివ్ పవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ యూఎస్‌ఏ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా అతిపెద్ద సర్వైకల్ క్యాన్సర్‌ (గర్భాశయ ద్వారానికి సంబంధించింది) కార్యక్రమాన్ని నిర్వహించాయి. తానా ఫౌండేషన్ తరఫున ట్రస్టీ విద్యాధర్ గారపటి ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు.

 ఈ అవగాహన కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు లభించడం విశేషం. గతంలో 1919 మందితో సర్వైకల్ అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఇప్పుడు 4000 మంది పాల్గొనడంతో పాత గిన్నిస్ రికార్డు చెరిగిపోయింది.

మార్చి 18న నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గుంటూరులోని విజ్ఞాన్ ఫౌండేషన్‌ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ వేదిక కావడం తెలుగువారికి గర్వకారణమని యాజమాన్యం పేర్కొంది.

సర్వైకల్‌ క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోతోంది.  2030 నాటికి మరణాల సంఖ్య 50 శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్‌ కారణంగా మరణించేవారిలో ప్రతి 10 మందిలో తొమ్మిది మంది తక్కువ, మధ్య ఆదాయ దేశాలకు చెందినవారే ఉండటం ఆందోళనకర విషయం.
చదవండి: అకాల వర్షాలపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top