ఏపీ ఫోరెన్సిక్‌ మాజీ డైరెక్టర్‌ మృతి

Former Director Of AP Forensic Department Sivakumar Died In Hotel - Sakshi

సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ఫొరెన్సిక్ మాజీ డైరెక్టర్ శివ కుమార్ రాజు (74) విజయవాడలోని డీవీ మేనర్ హోటల్‌లో శుక్రవారం రాత్రి మృతి చెందటం కలకలం సృష్టించింది. అయితే, ఆయనది సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు పోలీసులు. హైదబాబాద్‌లోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న శివకుమార్‌..  ఓ కేసు విషయంలో ఇటీవలే విజయవాడకు వచ్చారు. 

శనివారం ఉదయం ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా, బెల్‌ కొట్టినా రెస్పాన్స్‌ రాకపోవడంతో అనుమానించిన హోటల్‌ సిబ్బంది మరో తాళంచెవితో లోపలికివెళ్లి చూడగా విగతజీవిగా పడి ఉన్నారు శివకుమార్‌. హోటల్‌ సిబ్బంది అందించిన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని క్లూస్‌ సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. సాధారణ మృతిగానే ప్రాథమిక నిర్ధరణకు వచ్చినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి.. కేసుగా నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చదవండి: మధురపూడి విమానాశ్రయానికి మహర్దశ.. 5 పెద్ద విమానాల టేకాఫ్‌ చేసేలా విస్తరణ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top