ఉద్యోగాల పేరుతో యువతకు ఎర

A fake website on social media - Sakshi

పోలీసులకు తెలుగు, సంస్కృత అకాడమీ ఫిర్యాదు

విశ్వసించవద్దని అభ్యర్థులకు వినతి

సాక్షి, అమరావతి: రాష్ట్ర తెలుగు, సంస్కృత అకా­డమీ అకడమిక్‌ సర్వీసెస్‌లో 78 ఉద్యోగాలు.. అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌లో 156 ఉద్యోగాలు.. ఇదీ ఇటీవల వాట్సాప్‌లో వైరల్‌ అవుతున్న ప్రకటనలు. ఏకంగా ఓ వెబ్‌సైట్‌ రూపొందించి మరీ దరఖా­స్తులు ఆహ్వానిస్తున్నారు. తెలుగు, సంస్కృత అకాడ­మీలో ఉద్యోగాల కల్పన పేరిట యువతను మోస­గి­ం­చేందుకు ఓ ముఠా వేసిన ఎత్తుగడ ఇది.

సామా­జి­క­మాధ్యమాల్లో ఓ నకిలీ వెబ్‌సైట్‌ (https:// teluguacademy.org.recruitment), ఉద్యో­గాల భర్తీ నోటిఫికేషన్‌ వైరల్‌ అవుతున్న విషయాన్ని గుర్తిం­చిన అకాడమీ వెంటనే అప్రమత్తౖ­మెంది. తాము ఉద్యో­గాల భర్తీకి ఎలాంటి నోటిఫికే­షన్‌ ఇవ్వ­లేదని అకాడమీ డైరెక్టర్‌ వి.రామకృష్ణ ఆది­వారం ఓ ప్రకట­నలో తెలిపారు. సదరు నకిలీ నోటిఫికేషన్‌ను ఎవరూ విశ్వసించవద్దని కోరారు. ఆ వెబ్‌సైట్‌కు దర­ఖాస్తు చేయడంగానీ ఫీజుల రూపంలో నగదు చెల్లి­ంచడంగానీ చెయ్యొద్దని కూడా ఆయన తెలి­పారు.

తమ అకాడమీకి ఇప్పటివరకు ఎటువంటి వెబ్‌సైట్‌ లేదని స్పష్టంచేశారు. యువ­తకు ఏమైనా సందేహాలుంటే రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి. ఆంజనేయులు (ఫోన్‌ నంబర్‌: 9849616999)ను సంప్రదించాలని సూచించారు. ఇక రాష్ట్ర తెలుగు, సంస్కృత అకాడమీ పేరుతో ఉ­ద్యో­­­గాల భర్తీకి నకిలీ నోటిఫికేషన్‌ ఇవ్వడంపై రామ­కృష్ణ విజయవాడ పోలీసు­లకు ఫిర్యాదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top