‘సాక్షి’ రక్తదాన శిబిరానికి విశేష స్పందన

Excellent response to Sakshi Blood Donation Camp in Vijayawada

15వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో రక్తదాన శిబిరం

రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ బ్యాంకుతో కలిసి నిర్వహణ

రక్తదానం చేసిన సాక్షి సిబ్బంది, శ్రేయోభిలాషులు 

విశాఖలో ఆర్‌కే బీచ్‌ క్లీనింగ్‌ 

లబ్బీపేట(విజయవాడతూర్పు): సాక్షి దినపత్రిక 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ ఆటోనగర్‌­లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ సహకారంతో ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. సాక్షి సిబ్బందితోపాటు శ్రేయోభిలా­షులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు.

సాక్షి 15వ వార్షికోత్సవం సందర్భంగా రక్తదాన శిబి­రం నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పలు­వురు స్వచ్ఛం­దంగా రక్తదానం చేసేందుకు ముందుకొ­చ్చారు. సాక్షి సిబ్బందితోపాటు విజయవాడ వన్‌­టౌన్‌­లోని కేబీఎన్‌ కళాశాల విద్యార్థులు, అజిత్‌­సింగ్‌నగర్, సత్యనారాయణపు­రం, పటమట, ఆటో­న­గర్‌ తదితర ప్రాంతాలకు చెందిన శ్రేయోభిలా­షులు కలిపి మొత్తం 60 మంది రక్తదానం చేశారు.

ఉద­యం 11 గంటలకు ప్రారంభమైన రక్తదాన శిబిరం మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగింది. ఈ కార్యక్రమాన్ని సాక్షి బ్రాంచి మేనేజర్‌ ఆర్‌.యశో­ద­రాజ్, క్లస్టర్‌ ఇన్‌చార్జి ఎన్‌.వెంకటరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జి ఒ.వెంకట్రామిరెడ్డి  పర్యవేక్షించారు. 
విశాఖ ఆర్‌కే బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరిస్తున్న సాక్షి సిబ్బంది 

విశాఖలో ఆర్‌కే బీచ్‌ను శుభ్రం చేసిన ‘సాక్షి’ సిబ్బంది
బీచ్‌రోడ్డు: ‘సాక్షి’ దినపత్రిక 15వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖపట్నం యూనిట్‌ ఆధ్వర్యాన ఆర్‌కే బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ‘సాక్షి’ అడ్మినిస్ట్రేటివ్, ఎడిటోరియల్, రిపోర్టింగ్, యాడ్స్, సర్క్యులేషన్, టీవీ తదితర విభాగాలకు చెందిన సిబ్బంది గురువారం బీచ్‌లో చెత్త, వ్యర్థాలు సేకరించి జీవీఎంసీ పారిశుధ్య సిబ్బందికి అందించారు. విశాఖ సాగరతీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల మరింత అందంగా ఉంటుందని, పర్యాటకు­లను ఆకర్షిస్తుందని ఈ సందర్భంగా విశాఖపట్నం యూనిట్‌ బ్రాంచి మేనేజర్‌ చంద్రరావు అన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top