జగ్గయ్య పేటలో పవన్‌ అభిమానుల అత్యుత్సాహం | The Enthusiasm Of Pawan's Fans In Jaggayyapeta | Sakshi
Sakshi News home page

పవన్‌ అభిమానుల అత్యుత్సాహం.. థియేటర్‌లో భోగి మంట

Jan 3 2023 10:00 AM | Updated on Jan 3 2023 10:17 AM

The Enthusiasm Of Pawan's Fans In Jaggayyapeta - Sakshi

ఎన్టీఆర్‌ జిల్లా: జిల్లాలోని జగ్గయ్యపేటలోని ఓ థియేటర్‌లో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సినిమా థియేటర్‌లో భోగి మంట వేసి అలజడి రేపారు.  డిసెంబర్‌ 31వ తేదీన ఖుషీ సినిమా ప్రదర్శన సమయంలో థియేటర్‌లో అభిమానులు భోగి మంటలు వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

సినిమా ప్రదర్శన సమయంలో ధియేటర్ లోనే పేపర్లతో మంటలు వేశారు పవన్‌ అభిమానులు. స్క్రీన్ దగ్గర మంటలు వేసి డాన్సులు చేశారు. థియేటర్‌లో మంట ఎందుకు వేసారని ప్రశ్నించిన యజమానిపై పవన్‌ కల్యాణ్‌ అభిమానులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై థియేటర్‌ మేనేజర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement