‘ఈఎస్‌ఐ స్కామ్‌లో ఎవరి వాటా ఎంతో తేలుస్తాం’

Enquiry On AP ESI Scam Regarding Corruption Share - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన 150 కోట్ల ఈఎస్‌ఐ స్కాంలో అవినీతి నిరోధక శాఖ విచారణ ఇంకా కొనసాగుతోందని ఏసీబీ జేడీ రవికుమార్‌ గురువారం తెలిపారు. రవికుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈఎస్‌ఐ స్కాంలో ఎవరి వాటా ఎంతో త్వరలోనే తేలుస్తామని, గుర్తించిన నిందితులంతా రింగ్‌గా ఏర్పడి అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. కాగా డబ్బుల పంపకాలకు సంబంధించిన వాటాలపై నిందితుల నుంచి వివరాలు రాబట్టనున్నామని పేర్కొన్నారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడుకు డబ్బులు చేరలేదని ఏసీబీ చెప్పినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసిన ఎవరినీ వదిలి పెట్టమని, నిందితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తప్పుడు వార్తలతో కేసును తప్పుదారి పట్టించే యత్నం సరికాదని రవికుమార్‌ పేర్కొన్నారు.  కాగా ఈ కేసులో ఇప్పటికే  అచ్చెన్నాయుడుతో సహా 12 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: అరకొర జవాబులు.. ఆపై దాటవేత

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top