Suckermouth Catfish: వలకు చిక్కిన సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్‌

Devil Fish Spotted In East Godavari District - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి వద్ద మడేరు వాగులో మంగళవారం ఈ చేప ఓ గిరిజనుడి వలకు చిక్కింది. కిలో బరువు వుండే ఈ చేప వింతగా, భయం కలిగించేదిగా ఉంది. అక్కడి వారు దానిని వెంటనే వాగులోనే వదిలేశారు. ఈ చేపను సక్కర్‌ మౌత్‌ క్యాట్‌ ఫిష్‌ అంటారని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జూవాలజి లెక్చరర్‌ బొరుసు శ్రీకృష్ణ చెప్పారు. ఇది విషపూరితమైందన్నారు.

రూపాన్ని బట్టి దీనిని దెయ్యం చేపగా కూడా పిలుస్తారన్నారు. చుట్టూ వుండే చేపలను గాయపరచి, చంపి తింటుందన్నారు. దీనివల్ల దేశవాళీ చేపలు, ఇతర విలువైన నీటి ప్రాణులకు ప్రమాదం అన్నారు. ఇది ఉన్నచోట మిగతా చేపలు అంతరించిపోతాయన్నారు. ఇతర దేశాలకు చెందిన ఈ చేపను మొదట ఆక్వేరియంలో పెంచేందుకు మనవారు తీసుకొని వచ్చారన్నారు. దీని సంతతి పెరిగిపోతోందన్నారు.

చదవండి: ప్రియుడి మోజు: నిద్రపోతున్న భర్తపై దిండుతో అదిమిపట్టి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top