కొడాలి నాని, వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు కొట్టేసిన కోర్టు

Court Dismissed On Illegal Cases Kodali Nani And Ysrcp Leaders - Sakshi

సాక్షి, విజయవాడ: ఎమ్మెల్యే కొడాలి నాని, వైసీపీ నేతలపై టీడీపీ హయాంలో పెట్టిన అక్రమ కేసులను విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టేసింది. నానితో పాటు, మరో ఆరుగురు వైఎస్సార్‌సీపీ నేతలు నిర్దోషులుగా కోర్టు తీర్పునిచ్చింది. 2017లో వినాయకచవితి సందర్భంగా గుడివాడలో నాని నిర్వహించిన అన్న సమారాధనను పోలీసుల ద్వారా టీడీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది.

డీఎస్పీ మహేష్ నేతృత్వంలో అన్నదానాన్ని పోలీసులు అడ్డుకోబోగా, అన్నం పెడుతుంటే అడ్డుకోవడమేంటని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నించారు. భోజనం చేస్తున్న టేబుళ్లను పోలీసులు నెట్టి వెయ్యడంతో దుమారం చెలరేగింది.

ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే నాని, వైసీపీ నాయకులు గుడ్లవల్లేరు బాబ్జి, కొంకితల ఆంజనేయ ప్రసాద్, చుండూరి శేఖర్ సహా మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జరిగిన విచారణలో పోలీసులు చూపినవి తప్పుడు సాక్ష్యాలని న్యాయమూర్తి నిర్ధారించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను కొట్టేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు ఇచ్చింది.

ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్‌.. కాంగ్రెస్‌ యాక్షన్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top