
అనంతరం అతడు మండలంలోని జన్నవరానికి, సోమవారం అత్తగారి ఊరైన శ్రీరాంపట్నం వెళ్లాడు. అయితే అతనికి కోవిడ్ నిర్ధారణ అయినట్టు మంగళవారం ఎయిర్‌పోర్టు అథారిటీ వైద్య వర్గాల నుంచి గవరవరం వైద్య కేంద్రానికి సమాచారం అందింది.
చోడవరం రూరల్ (అనకాపల్లి జిల్లా): సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తికి విశాఖ విమానాశ్రయంలో జరిపిన కరోనా పరీక్షలో పాజిటివ్ నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలోని జన్నవరం గ్రామానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తి సింగపూర్‌లో పనిచేస్తున్నాడు. సెలవు దొరకడంతో ఊరికి వచ్చాడు. ఆదివారం విశాఖ విమానాశ్రయంలో దిగిన ఆయనకు ఎయిర్‌పోర్టులో వైద్య పరీక్షలు జరిపారు.
అనంతరం అతడు మండలంలోని జన్నవరానికి, సోమవారం అత్తగారి ఊరైన శ్రీరాంపట్నం వెళ్లాడు. అయితే అతనికి కోవిడ్ నిర్ధారణ అయినట్టు మంగళవారం ఎయిర్‌పోర్టు అథారిటీ వైద్య వర్గాల నుంచి గవరవరం వైద్య కేంద్రానికి సమాచారం అందింది. దీంతో వైద్యాధికారి దమయంతీదేవి సిబ్బంది జన్నవరం, శ్రీరాంపట్నం గ్రామాలకు చేరుకుని సింగపూర్ నుంచి వచ్చిన వ్యక్తి భార్య, పిల్లలు, అత్తమామల పరీక్షలు చేశారు.
వీరిలో భార్యకు మాత్రం కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. భార్యాభర్తలిద్దరినీ జన్నవరంలో వారి గృహంలోనే ఐసోలేషన్‌లో ఉంచామని, వారికి వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యాధికారి తెలిపారు. జన్నవరం, శ్రీరాంపట్నం గ్రామాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ప్రజలు భయపడాల్సిందేమీ లేదన్నారు.
చదవండి: భారత్‌లో ఎండెమిక్ స్టేజ్‌కు కరోనా.. అధికారుల కీలక ప్రకటన