75 దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ అందించాం

Corona vaccine has been provided to 75 countries - Sakshi

రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌

తిరుమల: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 75 దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ అందించామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. శనివారం ఆయన తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి లడ్డూ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటంతో ఘనంగా సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ.. 130 కోట్ల భారతీయుల సామర్థ్యం ఏమిటో నేడు ప్రపంచం చూస్తున్నదని తెలిపారు.

కరోనా సమయంలో 450 దేశాలకు మందులు సరఫరా చేశామన్నారు. అదేవిధంగా 75 దేశాలకు కరోనా వ్యాక్సిన్‌ను అందించామని తెలిపారు.  80 శాతం రైల్వే సేవలు ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో పూర్తిస్థాయిలో రైల్వే సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. తిరుపతి ఇతర ప్రాంతాల మధ్య అధికంగా రైళ్లు నడిచేలా అదనపు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రితో పాటు రాష్ట్ర ఆరి్థక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్వామివారిని 
దర్శించుకున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top