కొనసాగుతున్న భక్తుల రద్దీ | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Mon, May 20 2024 4:37 AM

Continual rush of devotees

తిరుమల: తిరుమలలో మూడు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కూడా ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని ఆక్టోపస్‌ వద్ద నుంచి క్యూలు ఉన్నాయి. వేసవి సెలవులు, వారాంతపు రద్దీకి తోడు దేశం నలుమూలల నుంచి వచి్చన భక్తులతో తిరుమల పోటెత్తింది సాధారణంగా మేలో అధిక రద్దీ ఉంటుంది. శుక్ర, శని, ఆదివారాలు కావడంతో ఇది గరిష్ట స్థాయికి చేరింది. 

టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆదేశాల మేరకు జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలతో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, తాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement