‘ఎస్‌ఈసీ నిర్ణయం ఆందోళనకు గురిచేసింది’

Conduct Of Elections During The Corona Is Inappropriate - Sakshi

కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదు..

ఏపీ పోలీసు అధికారుల సంఘం

సాక్షి, విజయవాడ: కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదని.. తమతో పాటు, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పెట్టలేమని ఏపీ పోలీసు అధికారుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వం కృషితో కరోనాపై నియంత్రణ సాధిస్తున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ప్రజాహితం కాదని పేర్కొంది. శుక్రవారం రాత్రి అకస్మాత్తుగా షెడ్యూల్‌ జారీ చేయడం.. పోలీసు సిబ్బందిని ఆందోళనకు గురిచేసిందన్నారు.(చదవండి: ఎన్నికల విధులు బహిష్కరిస్తాం: ఏపీ ఎన్జీవో)

‘కోవిడ్‌ మహమ్మారి వలన రాష్ట్రంలో 109 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. 14 వేల మంది కరోనా బారిన పడ్డారు. ప్రజలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియలో పోలీస్‌ సిబ్బంది అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్‌ రవాణా, నిల్వకు పోలీస్‌ బందోబస్తు నిర్వహించవలసి ఉంటుంది.  ఈ ప్రక్రియ అంతా పూర్తి అవ్వకుండా ఎన్నికల విధులకు హాజరు కావడం పోలీసు సిబ్బంది తమ ప్రాణాలను పెను ప్రమాదంలో పెట్టినట్లే. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిసేవరకు పోలీసు సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించలేరు’ అని పోలీసు అధికారుల సంఘం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.(చదవండి: ‘నిమ్మగడ్డ.. చంద్రబాబు తొత్తు’)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top