
అమరావతి: ఉద్యోగ సంఘాలతో ఈరోజు(సోమవారం) సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. నేటి సాయంత్రం గం. 4.30ని.లకు మంత్రుల కమిటీ సమావేశం అవ్వనుంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
మార్చి 7వ తేదీన జరిగిన సమావేశంలో నిర్ణయాలు ఇప్పటికే ప్రభుత్వం అమలు చేయగా, ఈరోజు మరికనని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మేరకు 13 ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించింది.