ఏపీలో చలిగాలులు పెరిగే అవకాశం

Cold Winds Are Likely To Increase In AP - Sakshi

మహారాణిపేట (విశాఖ దక్షిణ): రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో చలి గాలులు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం తెలిపారు. ఇప్పటికే  అనేక ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటోంది. దీనికి తోడు  ఎత్తులో ఈశాన్య, తూర్పు దిశల నుంచి చల్లటి గాలులు వీస్తున్నాయి. రాత్రి పూట చల్లటి గాలులు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.

మన్యం ప్రాంతాల్లో మంచు కురుస్తోందని, ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయని అధికారులు తెలిపారు. శుక్రవారం పాడేరులో 13.5 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 17.5, చింతపల్లిలో 18.5, అరకులో 17.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అనేక ప్రాంతాల్లో మూడు డిగ్రీల వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని, ఎక్కువ ప్రాంతాలు పొడిగా ఉంటాయని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top