కొనసాగుతున్న చలి తీవ్రత | Cold weather Continued in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న చలి తీవ్రత

Jan 11 2023 3:25 AM | Updated on Jan 11 2023 3:25 AM

Cold weather Continued in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. మంచుతోపాటు పొగమంచు కురు­స్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా అర­కులో మంగళవారం తెల్లవారుజామున 3.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జి.మాడు­గుల మండలం కుంతలంలో 4.1, చింతపల్లి మండలం చింతపల్లిలో 4.2, జీకే వీధిలో 4.3, డుంబ్రిగూడలో 4.4, జి.మాడుగుల, హకీంపేటలో 4.7, పాడేరులో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణో­గ్రతలు నమోదయ్యాయి.

ఏజెన్సీలోని చాలా­ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. రాయలసీమ­లోని పలు ప్రాంతాల్లోనూ విశాఖ ఏజెన్సీ తర­హాలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద­వడం విశేషం. శ్రీసత్యసాయి జిల్లా ఆగలిలో 7.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లా మడకశిర మండలం ఆర్‌.అనంతపురం, అనంతపురం జిల్లా బెళుగుప్పలో 8.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  

Advertisement
 
Advertisement
Advertisement