జి.మాడుగుల @ 3.2 డిగ్రీలు | Minimum temperatures are dropping sharply day by day in Manyam Alluri Seetharamaraju district | Sakshi
Sakshi News home page

జి.మాడుగుల @ 3.2 డిగ్రీలు

Dec 12 2025 2:42 AM | Updated on Dec 12 2025 2:42 AM

Minimum temperatures are dropping sharply day by day in Manyam Alluri Seetharamaraju district

అల్లూరి జిల్లా గజగజ

పలు గ్రామాల్లో మంచువర్షం

డుంబ్రిగుడ, అరకువ్యాలీ, ముంచంగిపుట్టులో తీవ్రంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

సాక్షి, పాడేరు/చింతపల్లి/జి.మాడుగుల: అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలో రోజురోజుకూ కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్నాయి. చలితీవ్రత పెరుగుతోంది. బుధవారం రాత్రి జి.మాడుగులలో 3.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇంత తక్కువగా రాత్రి ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే మొదటిసారి. 

డుంబ్రిగుడలో 3.6, అరకువ్యాలీలో 3.9, ముంచంగిపుట్టులో 4.4, హుకుంపేటలో 5.4, పాడేరులో 6.7, పెదబయలులో 7.1, వై.రామవరంలో 8.7, మారేడుమిల్లిలో 9.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోద­య్యాయ­ని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్‌ అధికారి ఆళ్ల అప్పల­స్వామి గురువారం తెలిపారు. 

జి.మాడు­గుల, డుంబ్రిగుడ, అరకువ్యాలీ, ముంచంగిపుట్టు, హుకుంపేట, పాడేరు తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోవడంతోపాటు భారీగా పొగమంచు కురుస్తోంది. గురువారం ఉదయం 8 గంటల వరకు పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనచోదకులు లైట్లు వేసుకుని ప్రయాణించారు. చలితీవ్రతకు స్థానికులు గజగజ వణికిపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement