CM YS Jagan Birthday Celebrations: ఘనంగా సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు

CM YS Jaganmohan Reddy Birthday Celebration On 21st December - Sakshi

గుంటూరు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా బ్రాడీపేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్‌లో హోంమంత్రి మేకతోటి సుచరిత రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, మొక్కలు నాటారు.
రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం ఇచ్చిన ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిధర్, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

విశాఖపట్నం
విశాఖ నగర పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్.. ఎమ్మెల్సీలు వంశీ, కల్యాణి, మేయర్‌,జడ్పీ చైర్మన్‌తో కలిసి కేక్‌ కట్‌ చేసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

కృష్ణా జిల్లా
విజయవాడ సత్యనారాణయపురంలో సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు,.. కార్పొరేటర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం రోడ్లపై నిద్రిస్తున్న యాచకులకు, వృద్ధులకు.. దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. 

అనంతపురం జిల్లా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం సందర్భంగా మంత్రి శంకర నారాయణ పెనుకొండ బీసీ బాలుర హాస్టల్‌ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయి గూడెం మండలం ముప్పిన వారి గూడెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.


సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
మొక్కలు నాటి, శివాలయంలో పత్యేక పూజలు చేసిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం ప్రధానంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పార్టీ నిర్ణయించిందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌ పుట్టినరోజు పార్టీ శ్రేణులకే కాకుండా ప్రజలందరికీ పర్వదినం వంటిదన్నారు. అందుకే ఆ రోజు సేవా కార్యక్రమాలతోపాటు ప్రత్యేకంగా ప్రజల్లో అవగాహన పెంచే విధంగా ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు.

ఈ క్రమంలో గతేడాది కరోనా నేపథ్యంలో రక్త నిల్వల కొరతను నివారించడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. తద్వారా ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద మంగళవారం ఉదయం మొక్కలు నాటడం, రక్తదానం, పేదలకు దుస్తులు, దుప్పట్లు, నిత్యావసరాల పంపిణీ, అన్నదానం తదితర కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు, సీఎం జగన్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top