
తాడేపల్లి : ఏలూరు జిల్లా గణపవరం గ్రామానికి చెందిన పెద్ది శ్రీను కుటుంబంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో ట్వీట్ చేశారు. దివ్యాంగుడైన పెద్ది శ్రీనుకి పెన్షన్‌తో పాటు అతని భార్య పేరు మీద భూపట్టా, వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి ఇచ్చి వారి జీవితంలో వెలుగులు నింపినందుకు సంతోషంగా ఉందని సీఎం జగన్ ట్వీట్ చేశారు.
ఇటువంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.పెద్ది శ్రీను కుటుంబానికి మన ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచినందుకు గర్వపడుతున్నానని సీఎం జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
పెద్ది శ్రీను కుటుంబానికి మన ప్రభుత్వం పెద్ద దిక్కుగా నిలిచినందుకు గర్వపడుతున్నాను. శ్రీనుకు దివ్యాంగ పెన్షన్ తో పాటు తన భార్య పేరుమీద భూపట్టా, వైయస్సార్ చేయూత, అమ్మఒడి ఇచ్చి వారి జీవితంలో, ఇటువంటి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపే అవకాశం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. pic.twitter.com/fKRdeUV0Uf
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 14, 2023