అధికారుల తీరుపై సీఎం వైఎస్ జగన్ సీరియస్‌

CM YS Jagan Serious On Officers - Sakshi

ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఆదేశం

సాక్షి, అమరావతి: నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొంతమంది అధికారుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెర్మామెన్స్ బాగా లేనివారికి మెమో జారీచేయాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంపై సీఎం.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారానికి నాలుగు సార్లు గ్రామ, వార్డు సచివాలయాలు సందర్శించాలని చెప్పాం, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకుంటే సమస్యలెలా తెలుస్తాయని సీఎం ప్రశ్నించారు.

తప్పులు జరిగితే వాటిని సరిచేసే అవకాశం ఉంటుందని, కలెక్టర్లు, జేసీల స్థాయిలో పర్యవేక్షణ బాగుందన్నారు. మిగిలిన అధికారులు కూడా సమర్ధవంతంగా పనిచేయాలన్నారు. 100 శాతం గ్రామ, వార్డు సచివాలయాల్లో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పేదల గురించి ఆలోచించి మానవత్వం చూపించాలని సీఎం జగన్‌ అన్నారు.

‘‘డీబీటీ పథకాల్లో సోషల్ ఆడిట్ కోసం జాబితాను ప్రదర్శిస్తున్నారా? లేదా? చూడాలి. బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్యశ్రీ పథకాలు అత్యంత ముఖ్యమైనవి. నిర్దేశించుకున్న గడువులోగా అర్హులకు అందేలా చూడాలి. వీటిని స్వయంగా పరిశీలించాలి, పర్యవేక్షణ, సమీక్ష చేయాలి. ఏమైనా లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి. గ్రామ, వార్డు సచివాలయాలను అధికారులు తరచూ తనిఖీ చేయాలి. ఆగస్టు 10న నేతన్న నేస్తం, ఆగస్టు 16న విద్యాకానుక అందజేస్తాం. రూ.20 వేల లోపు డిపాజిట్‌ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న నగదు జమ చేస్తాం. ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు, స్పిన్నింగ్‌మిల్స్‌కు ఆగస్టు 27న ఇన్సెంటివ్‌లు ఇస్తామని, ఈ మేరకు కలెక్టర్లు సన్నద్ధంగా సీఎం వైఎస్‌ జగన్ ఆదేశించారు.
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top