Sakshi News home page

అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్‌

Published Sat, Aug 22 2020 10:12 AM

CM YS Jagan Review Meeting On Floods - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణానదిలోకి భారీగా వరద జలాలు వస్తున్న నేపథ్యంతో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోదావరి ముంపు బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉండాలని ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లకు ఆయన స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి విడుదల అవుతున్న వరదనీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోస్‌పై సీఎంఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత ప్రకాశం బ్యారేజీలోకి 4 లక్షల క్యూసెక్కుల వరదనీరు వస్తుందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ నుంచి ప్రజలను ఖాళీ చేయించాలన్నారు. (వైద్యం.. మరింత చేరువ)    

ఎప్పటికప్పుడు వస్తున్న వరదను అంచనా వేసుకుని ఆ మేరకు చర్యలు చేపట్టాలన్నారు. సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎక్కడా లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. అటు గోదావరిలో కూడా వరద కొనసాగుతున్న నేపథ్యంలో ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో అండగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వారికి ఆహారం, మందులు, మందులు, ఇతరత్రా సౌకర్యాల్లో ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలన్నారు. నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం స్పష్టంచేశారు. ఈమేరకు ఇరు జిల్లాల కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Advertisement

What’s your opinion

Advertisement