విజయకాంత్ మృతిపై ఏపీ సీఎం జగన్ సంతాపం

CM YS Jagan Pays Tribute To Actor And DMDK Founder Vijayakanth - Sakshi

గుంటూరు, సాక్షి: ప్రముఖ సినీ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ మృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. 

విజయకాంత్‌ కుటుంబసభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతిని సదరు ప్రకటనలో తెలిపారు సీఎం జగన్‌. యాక్షన్‌ హీరోగా తమిళ చలన చిత్ర పరిశ్రమలోనే కాదు.. అక్కడి రాజకీయాల్లోనూ ఆయన చెరగని ముద్ర వేసింది తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. 71 ఏళ్ల విజయ్‌కాంత్‌ ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఈమధ్యే కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించడంతో ఆయన అభిమానులు సంతోషించారు. అయితే కరోనా బారినపడ్డాక ఆయన పరిస్థితి మరింత విషమించింది. దీంతో ఈ ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

ఇదీ చదవండి: తమిళ రాజకీయాల్లో కెప్టెన్‌ ఓ సంచలనం

    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top