AP: CM YS Jagan First Visit Narasaraopet After Palnadu Formation - Sakshi
Sakshi News home page

CM Jagan: పల్నాడు జిల్లా కేంద్రంలో సీఎం జగన్‌ పర్యటన

Apr 6 2022 11:20 AM | Updated on Apr 6 2022 12:36 PM

CM YS Jagan First Visit Narasaraopet After Palnadu Formation - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ చేయనున్నారు. 

అనంతరం 11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అదే వేదికపై వలంటీర్లను సత్కరించి ప్రోత్సాహకాలు అందించనున్నారు సీఎం జగన్‌. తిరిగి 12.35 గంటలకు నరసరావుపేట నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

ఇదిలా ఉండగా.. ఉమ్మడి గుంటూరు జిల్లాను గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. పల్నాడు జిల్లా కేంద్రంగా నరసరావుపేటలో ఇప్పటికే జిల్లా పాలనా యంత్రాంగం పనులు ప్రారంభించింది కూడా.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement