చిన్నారుల ప్రతిభకు సీఎం జగన్‌ ప్రశంస

CM YS Jagan Appreciated And Rewarded 1 Lakh Rupees To Children - Sakshi

అమరావతి: పశ్చిమ గోదావరికి జిల్లా తణుకు పట్టణానికి చెందిన చిన్నారి జొనాదుల లిషిత (5)ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు. ఇటీవలే స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు కోసం లిషిత తణుకులో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. 20 మీటర్ల పొడవు, 8 అంగుళాల ఎత్తు కేటగిరీలో ఫైర్‌ లింబో స్కేటింగ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులు అనూష, ఉమామహేశ్వర్, కోచ్‌ లావణ్య సహా ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు క్యాంప్‌ కార్యాలయంలో  సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా చిన్నారి లిషితను అభినందించిన సీఎం ఆమెకు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.

సానా నుంచి అవార్డును పొందిన చిన్నారి
పాన్‌ స్టార్స్‌ టెలిస్కోప్‌ సహకారంతో బృహస్పతి (గురుడు), అంగారక గ్రహాల మధ్య ఆస్టరాయిడ్‌ను కనుగొన్న చిన్నారి కైవల్యారెడ్డిని సీఎం జగన్‌ అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన కైవల్యా ప్రతిభను మెచ్చి నాసా గుర్తింపు పొందిన ఇంటర్నేషనల్‌ ఆస్ట్రోనామికల్‌ సెర్చ్‌ కొలాబిరేషన్‌ (ఐఏఎస్‌సి) ఆమెకు అవార్డును బహుకరించింది. ఈ సందర్భంగా చిన్నారి కైవల్యను అభినందించిన సీఎం ఆమెకు లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. చిన్నారితో వెంట ఆమె తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి ఉ‍న్నారు. 

చదవండి:
ఫైర్‌ లింబో స్కేటింగ్‌లో ప్రపంచ రికార్డు

ఒమన్‌ నుంచి ముగ్గురు మహిళలు రాక
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top