సీఎం జగన్‌పై అభిమానంతో..

CM Jagans fan donated valuable land for Secretariat construction - Sakshi

విలువైన స్థలాన్ని సచివాలయానికి విరాళమిచ్చిన అభిమాని

ఇచ్ఛాపురం రూరల్‌ (శ్రీకాకుళం): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానంతో రూ.లక్షల విలువైన భూమిని సచివాలయం నిర్మాణానికి అందజేసి తన పెద్దమనసు చాటుకున్నాడు ఓ వీరాభిమాని. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన మేరుగు నారాయణరెడ్డికి 80 సెంట్లు భూమి ఉంది. ఆయనకు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఎనలేని అభిమానం. సీఎంగా పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చి గ్రామ సచివాలయం నిర్మించేందుకు రూ.10 లక్షల విలువైన 6 సెంట్ల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు శనివారం గ్రామ సర్పంచ్‌ పాతిర్ల రాజశేఖరరెడ్డికి భూ పత్రాలను అందజేశారు. 

పెద్దమ్మను ఒప్పించి వెల్‌నెస్‌ సెంటర్‌కు స్థలం 
మేరుగు నారాయణరెడ్డి తన స్థలాన్ని సచివాలయానికి ఇవ్వడంతో పాటు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ‘వెల్‌నెస్‌ సెంటర్‌’కు తన పెద్దమ్మ మేరుగు కామమ్మకు చెందిన రూ.25 లక్షల విలువైన 10 సెంట్ల స్థలాన్ని కూడా ఇచ్చేలా ఆమెను ఒప్పించారు. కొద్ది రోజుల క్రితం రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top