‘మాకు చిరకాలం మీరే సీఎంగా ఉండాలి’

CM Jagan Spoke With Beneficiaries  Of YSR Asara - Sakshi

సాక్షి, అమ‌రావ‌తి :  ఆంధ్రప్రదేశ్‌లో హామీల బాటలో మరో పెద్ద ఎన్నికల హామీ అమలుకు అడుగు ముందుకు పడింది. ముఖ్య‌మ‌త్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శుక్ర‌వారం  తన క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు ‌ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల్లోని ఆసరా లబ్దిదారులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. (‘వైఎస్సార్‌ ఆసరా’కు సీఎం జగన్‌ శ్రీకారం)

పెద్ది నిర్మల సరుబుజ్జిలి మండలం, శ్రీకాకుళం జిల్లా
‘మీరు 3,648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్రలో మా అక్కాచెల్లెమ్మల కష్టాలు చూసి చలించి పొదుపు సంఘాల రుణాలు అన్నీ కూడా నాలుగు దఫాలుగా నేరుగా మాకు జమ చేయడం మాకు సంతోషంగా ఉంది, మా మహిళలకు ఇంత గొప్ప సాయం చేసే ముఖ్యమంత్రిని కనీవినీ ఎరగలేదు. మాకు ఇలాంటి కష్టకాలంలో అన్ని పథకాలు కూడా అమలు చేస్తున్నారు, మా జిల్లాలో 47 వేల సంఘాలు ఉన్నాయి. మా సంఘానికి రూ.3.40 లక్షల రూపాయల ఎలిజిబిలిటీ వచ్చింది, అందులో నావాటాగా రూ.8,500 అందుకోబోతున్నాను. వైఎస్‌ఆర్‌ చేయూత పథకం కలికితురాయిగా ఉంది.

వైఎస్‌ఆర్‌ ఆసరా మాకు కోటివరాల మణిరత్నంగా ఉంది. మీరు నేతన్న నేస్తం ద్వారా మాకు సాయం చేశారు, ప్రతీ కుటుంబానికి లబ్ది జరుగుతుంది, మా నేతన్నలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అర్హత ఉండి నమోదు కాని వారికి కూడా గడువిచ్చారు. మీరు అమలు చేసిన ప్రతీ పధకం అందరికీ అందుతున్నాయి. నా కుటుంబంలో నేను చిన్న చీరల వ్యాపారం చేస్తున్నాను, నాకు సున్నావడ్డీ, ఆసరా పధకాల ద్వారా లబ్దిపోందాను, నేను వితంతు ఫించన్‌ కూడా తీసుకుంటున్నాను. ఉదయం 6 గంటలకే వలంటీర్‌ వచ్చి పెన్షన్‌ ఇస్తున్నారు. మీకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మీరే మా ముఖ్యమంత్రిగా ఎప్పుడూ ఉండాలని మేం మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ 

చిట్టెమ్మ- అనంతపురం రూరల్‌ మండలం
‘మన ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ప్రతీరోజు పండుగ వాతావరణం నెలకొంది, మీ పాలన వల్లే మేం ఇంత సంతోషంగా ఉన్నాం, మీరు ఇచ్చిన మాట ప్రకారం మా రుణాలు మాఫీ చేస్తున్నారు, 90 లక్షల మంది లబ్ధిపొందుతున్నారు, కరోనా కష్టాల్లోనూ ఇంత పెద్దమొత్తంలో మాకు సాయం చేస్తున్నారు. ప్రపంచ చరిత్రలోనే మహిళా సంఘాలకు ఇంత గొప్ప సాయం చేయడం మా అదృష్టం. చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తున్నారు. నేను జిరాక్స్‌ మెషిన్‌తో జీవనోపాధి పొందుతున్నాను, దానికి తోడు ఈ ఆసరా డబ్బు వృథా చేయకుండా నా కుటుంబ ఆదాయం పెంచుకోవాలని అనుకుంటున్నాను. గత ప్రభుత్వం మాట ఇచ్చి తప్పింది, దానివల్ల మేం చాలా నష్టపోయాం.

 మా మహిళా సంఘాల అందరి తరపునా ప్రత్యేక ధన్యవాదాలు. మా అనంతపురం జిల్లాలో చేనేతల కష్టాలు గుర్తించి నేతన్న నేస్తం కింద వారి ఖాతాల్లోకి రెండు విడతలుగా రూ.48 వేలు వేశారు. దీంతో వారంతా సంతోషంగా ఉన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ ద్వారా నేను లబ్దిపొందాను. వసతి దీవెన, అమ్మ ఒడి పథకాలు ద్వారా మేం లబ్దిపొందుతున్నాం. నా కుటుంబం మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ పథకాల ద్వారా రూ. 1.91 లక్షలు లబ్ది పొందాను. మీరు చాలా చేశారు. మాకు చిరకాలం మీరే సీఎంగా ఉండాలని కోరుకుంటూ కలకాలం మా జీవితాల్లో వెలుగులు నింపుతారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.’ 

కొండూరు జ్యోతి- అవనిగడ్డ మండలం, కృష్ణా జిల్లా
నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పండుగ వాతావరణం ఉంది. మా మహిళల కష్టాలు చూసి మీరు మౌనంగా ఉండిపోకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. మా మహిళలు అందరి తరపునా మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. గత ప్రభుత్వం మాకు రుణాలు మాఫీ చేస్తామని మోసం చేసింది . మేం అప్పులపాలు అయ్యాం. వైఎస్‌ఆర్‌ సున్నావడ్డీ, ఆసరా,చేయూత పధకాలు ప్రభంజనం సృష్టించాయి.ఈ పథకాల ద్వారా వచ్చిన ప్రతీ రూపాయిని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకుంటున్నాం. నా కుటుంబంలోనే అనేక పథకాల ద్వారా లబ్దిపొందారు. మాకు ఉన్నత జీవనోపాధి కల్పించిన మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. మేం అడగకుండానే ఇన్ని పథకాలు ఇవ్వడం సంతోషంగా ఉంది. జలయజ్ఞం ద్వారా ప్రకాశం బ్యారేజి దిగువన రెండు బ్యారేజిలు నిర్మించడంపై అందరూ సంతోషంగా ఉన్నారు. మీరు రెండు జిల్లాల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చుతున్నారు. రైతులందరి తరపునా మీకు పాదాభివందనం. మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

గంగాభవానీ- (శివపార్వతి స్వయం సహాయక గ్రూప్), సామర్లకోట, తూర్పు గోదావరి జిల్లా:
ఆసరా సొమ్ముతో నా పచ్చళ్ళ వ్యాపారంను పెంచుకుంటా. డ్వాక్రా గ్రూపు సభ్యురాలిగా నేను పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నాను. మీరు ఇప్పుడు అందిస్తున్న వైయస్‌ఆర్ ఆసరా పథకం కింద ఇచ్చే సొమ్ముతో నా వ్యాపారంను పెంచుకుంటాను. నా భర్త సంపాదన కన్నా నేను ఎక్కువ సంపాధించగలననే నమ్మకం కలుగుతోంది. నాన్నగారు స్వర్గీయ వైయస్‌ఆర్ మహిళలకు పెట్టిన పథకాల కన్నా రెట్టింపు పథకాలను మీరు అమలు చేస్తున్నారు. మా ఇంటికి అన్నగా నిలుస్తున్నారు.

శోభాబాయి- వైఎస్సార్‌ కడప జిల్లా:
గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది.. పాదయాత్ర సమయంలో నేనున్నాను అంటూ మీరు మహిళలకు భరోసా ఇచ్చారు. ఈ రోజు మహిళా సంఘాల తరుఫున కృతజ్ఞతలు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేసింది. దానివల్ల మా సంఘాలు చిన్నాభిన్నం అయ్యాయి. ఎన్నికల సమయంలో పసుపుకుంకుమ పేరుతో మరోసారి మోసం చేయాలని చూసింది. కానీ మేం మోసపోలేదు. నేను స్వీట్ బాక్స్ బిజినెస్ చేస్తున్నాను. ఈ డబ్బు నా వ్యాపారంకు వినియోగిస్తాను. కరోనా సమయంలోనూ ఒక దేవుడిలా మమ్మల్ని ఆదుకున్నారు. కరోనా రక్షణ మాస్క్ లు తయారు చేసుకునే పని కల్పించారు. శానిటైజర్లు ఎలా తయారు చేసుకోవాలో శిక్షణ ఇప్పించారు. మీరు మహిళా పక్షపాతి. అనేక సంక్షేమ పథకాలను మహిళల కోసం అమలు చేస్తున్నారు. మీరు కలకాలం సీఎంగా వుండాలి.

నాగమణి-చెట్టుపల్లి గ్రామం, విశాఖపట్నంజిల్లా:
వైఎస్సార్‌‌ ఆసరా ప్రారంభంను పండుగలా జరుపుకుంటున్నాం.వైఎస్సార్‌ ఆసరా పథకం ప్రారంభంను మేం పండుగలా జరుపుకుంటున్నాం. మీరు ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా నాకు వ్యక్తిగతంగా రూ.9వేలు అందుతోంది. ఈ డబ్బుతో ఒక దేశవాళీ ఆవును కొనుగోలు చేయాలని అనుకుంటున్నాను. నాకు ఒక ఎకరం భూమి వుంది. ఆ భూమిలో  సేంద్రీయ వ్యవసాయం చేసుకుని, నా కుటుంబానికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందిస్తాను. మా గ్రూపునకు అందిన సొమ్మతో ఆవులను కొనుగోలు చేసి, అమూల్ సహకారంతో డైయిరీ ఫాం పెట్టుకుంటాం.

బాలసుందరి- కనకదుర్గ మహిళా సంఘం, ఏల్చూరు గ్రామం, ప్రకాశంజిల్లా: 
నాన్న గారు వున్నప్పుడు పావలావడ్డీకి రుణాలు ఇచ్చారు. మీరు సున్నావడ్డీకే మాకు రుణాలు ఇప్పిస్తున్నారు. కరోనా కష్ట సమయంలో, రాష్ట్రంలో ఏ విధమైన ఆర్థిక వనరులు లేప్పటికీ కూడా మీరు మహిళలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. గతంలో మేం తీసుకున్న రుణాలకు వడ్డీలు కట్టడానికే సరిపోయేది. మీరు సున్నావడ్డీతో మాకు ఊరట కల్పిస్తున్నారు. మా తోటబుట్టిన వారి కంటే ఎక్కువగా మీరు మా కోసం ఆలోచిస్తున్నారు. నడివయస్సులో వున్న వారిపైన అనేక భారాలు వుంటాయి. అటువంటి కోసం ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి మీరే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top